Latest Updates
ప్రపంచం మొత్తం భారత్‌కు మద్దతుగా నిలిచింది కానీ కాంగ్రెస్ మాత్రం రాజకీయాలే చేసింది: ప్రధాని మోదీ
మేడిన్ ఇండియా మిస్సైళ్లతో, డ్రోన్లతో పాకిస్తాన్‌ను భారత్ గట్టిగా బదులు ఇచ్చిందని లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. “ఉగ్రవాద ప్రభుత్వాన్ని, ఉగ్రవాద నేతలను వేర్వేరుగా చూడడం లేదు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రపంచ దేశాలు భారత్‌కు అండగా నిలిచాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం భారత్‌కు మద్దతు ఇవ్వడంలో విఫలమైంది. వారు రాజకీయ లబ్ధికే మొగ్గు చూపుతున్నారు. పాకిస్తాన్‌కు కేవలం మూడు దేశాలే మద్దతుగా నిలిచాయి” అని ఆయన అన్నారు.