ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తన ప్రజాదరణను చాటారు. గ్లోబల్ లీడర్స్‌పై మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన తాజా సర్వేలో ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా మోదీ నిలిచారు. జూలై 4 నుండి 10 వరకు నిర్వహించిన ఈ సర్వేలో మోదీకి 75 శాతం మద్దతు లభించింది. ఈ మద్దతుతో మోదీ మొదటి స్థానాన్ని దక్కించుకోగా, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ రెండో స్థానంలో నిలిచారు. ప్రజల్లో విశ్వాసం, నాయకత్వ నైపుణ్యం వంటి అంశాలపై ఆధారంగా ఈ సర్వే చేయగా.. మోదీ స్థానం మరోసారి చర్చనీయాంశమైంది.
గతంలోనూ మోదీ ఈ జాబితాలో ఆధిక్యత కనబరిచారు. 2021 సెప్టెంబర్‌లో ఆయనకు 70% మద్దతు లభించగా, 2022లో ఇది 71%కి చేరింది. 2023, 2024 సంవత్సరాల్లో ఈ మద్దతు మరింత పెరిగి వరుసగా 76%, 78 శాతానికి చేరింది. తాజా సర్వేలో slight తగ్గుదల ఉన్నప్పటికీ, మోదీ ప్రపంచ నేతలలో టాప్ పొజిషన్‌లో కొనసాగడం గమనార్హం. ఈ ఫలితాలు భారతదేశంలో మోదీకి ఉన్న విస్తృత ప్రజాదరణకు ప్రతీకగా భావిస్తున్నారు.