Latest Updates
ప్రతి నీటి బొట్టూ అమూల్యం: హర్షవర్ధన్

పట్టణాల్లో నీటి కొరత రోజురోజుకూ తీవ్రమవుతోందని, అపార్టుమెంట్ల వద్ద వరుసగా కనిపించే వాటర్ ట్యాంకర్లు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని కేంద్ర మాజీ మంత్రి డా. హర్షవర్ధన్ పేర్కొన్నారు. మనం చేయగలిగే చిన్న జాగ్రత్తలు నీటి వృథాను తగ్గించడంలో పెద్ద సహాయంగా ఉంటాయని ఆయన చెప్పారు.
ఇంటి పైభాగంలో ఉండే ట్యాంక్ నిండకముందే మోటార్ ఆఫ్ చేయకపోతే రోజూ వందల లీటర్ల నీరు వృథా అవుతుందని ట్వీట్ చేశారు. ప్రతి నీటి బొట్టూ ముఖ్యమైనదని గుర్తించి, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన ప్రజలకు సూచించారు
![]()
