Andhra Pradesh
ప్రకాశ్ రాజ్ ట్వీట్ చంద్రబాబు, పవన్ గురించేనా?
హైదరాబాద్: క్రిమినల్ కేసుల్లో అరెస్టై 30 రోజులు జైలులో ఉంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పదవులు కోల్పోవాలని కేంద్రం తీసుకొచ్చిన కొత్త బిల్లుపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఈ బిల్లుపై తనకో చిన్న “చిలిపి సందేహం” కలిగిందంటూ ఆయన ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.
ప్రకాశ్ రాజ్ ట్వీట్: “మాజీ సీఎం కానీ ప్రస్తుత సీఎం కానీ తమ మాట వినకపోతే… అరెస్టు చేసి, మీ మాట వినే ఉపముఖ్యమంత్రిని సీఎం చేసే కుట్ర ఏమైనా ఉందా?” అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యను ఆయన ప్రత్యేకంగా తెలుగులోనే రాయడం, ఆ ట్వీట్‌కి స్థానిక రాజకీయ రంగు వచ్చేలా చేసింది.
AP రాజకీయాల్లో చర్చ: ఈ ట్వీట్ ఆంధ్రప్రదేశ్ పరిస్థితులకే సంకేతమా? అన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌పై ఇది ఉద్దేశించిందా? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రకాశ్ రాజ్ పేరు చెప్పకపోయినా, ఆయన ట్వీట్ AP రాజకీయ వాతావరణంలో కొత్త చర్చకు దారితీసింది.