Andhra Pradesh
పోలీసులపైనా తప్పుడు కేసులా?: జగన్ ఆరోపణ
ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. “మాట వినని అధికారులను అరెస్ట్ చేస్తూ, పోలీసులపై కక్షసాధింపులకు పాల్పడుతోంది కూటమి ప్రభుత్వం,” అని ఆయన మండిపడ్డారు.
సీనియర్ ఐపీఎస్ అధికారులైన PSR ఆంజనేయులు, సంజయ్, సునీల్, కాంతిరాణా, విశాల్ గున్నీలపై తప్పుడు కేసులు బనాయించారని జగన్ ఆరోపించారు. అంతేకాకుండా, 8 మంది డీఎస్పీలను సస్పెండ్ చేసి, వందల మంది పోలీసులను వీఆర్‌కు పంపించారని పేర్కొన్నారు. “కొంతమంది పోలీసులు నీచపు పనులు చేయలేక రాష్ట్రం నుంచే వెళ్లిపోతున్నారు,” అని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అధికారులపై సాగుతున్న వేటను ఆయన తీవ్రంగా ఖండించారు.