Entertainment
‘పెద్ది’లో ‘మీర్జాపూర్’ ఫేమ్ దివ్యేందు – పోస్టర్ విడుదల
మీర్జాపూర్’ వెబ్ సిరీస్లో “మున్నా త్రిపాఠి” పాత్రతో దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న నటుడు దివ్యేందు, ఇప్పుడు తెలుగు చిత్రం ‘పెద్ది’లో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన ఇందులో ‘రామ్ బుజ్జి’ అనే పాత్రలో కనిపించనున్నారు. జూన్ 19న ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసింది.
ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో శివరాజ్ కుమార్, జాన్వీ కపూర్ వంటి నటులు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.