Latest Updates
పుట్టినరోజు సందర్భంగా తండ్రి ఆశీర్వాదం పొందిన కేటీఆర్
మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) తన పుట్టినరోజు సందర్భంగా తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. భార్య శైలిమ, కుమారుడు హిమాన్షుతో కలిసి ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లిన కేటీఆర్, తల్లిదండ్రులకు పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ తన కుమారుడిని ఆలింగనం చేసుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్షణాలు ఆప్యాయతతో నిండినవిగా మారాయి.