Business
పీఎన్‌బీ బంపర్ ఆఫర్: 444 రోజుల డిపాజిట్‌పై అత్యధిక వడ్డీ.. రూ. 5 లక్షలు పెడితే ఎంతొస్తుందంటే?
ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తన ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను సవరించింది. ఇతర ప్రభుత్వ బ్యాంకులతో పోలిస్తే 444 రోజుల ప్రత్యేక గడువుపై పీఎన్‌బీ ఆకర్షణీయమైన వడ్డీని అందిస్తోంది.
సేవింగ్స్ చేయాలనుకునే వారికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ తీపి కబురు అందించింది. ఫిబ్రవరి 24, 2026 నుండి అమల్లోకి వచ్చిన కొత్త వడ్డీ రేట్ల ప్రకారం,రూ. 3 కోట్ల లోపు రిటైల్ డిపాజిట్లపై వడ్డీని పెంచింది. ముఖ్యంగా 444 రోజుల స్పెషల్ ఎఫ్డీ స్కీమ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.సాధారణ పౌరులు 3.00% నుండి 6.60% వరకు,సీనియర్ సిటిజన్లు 3.50% నుండి 7.10% వరకు,సూపర్ సీనియర్ సిటిజన్లు (80 ఏళ్లు పైబడిన వారు) 3.80% నుండి 7.40% వరకు.
మీరు ఒకేసారి రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే, మెచ్యూరిటీ తర్వాత మీకు అందే మొత్తం ఇలా ఉంటుంది.సాధారణ కస్టమర్లు సుమారు రూ. 5,40,000,సీనియర్ సిటిజన్లు సుమారు రూ. 5,43,000,సూపర్ సీనియర్ సిటిజన్లు సుమారు రూ. 5,45,000,పీఎన్‌బీ అందిస్తున్న 6.60% వడ్డీ (సాధారణ పౌరులకు) ప్రస్తుతం ఎస్‌బీఐ (6.45%), బ్యాంక్ ఆఫ్ బరోడా (6.45%), కెనరా బ్యాంక్ (6.45%) కంటే ఎక్కువగా ఉండటం విశేషం. సురక్షితమైన ప్రభుత్వ బ్యాంకులో అధిక రాబడి కోరుకునే వారికి ఇది మంచి అవకాశం.
![]()
