Latest Updates
పాక్ ఓపెనర్ల ఊచకోత: శ్రీలంక ముందు భారీ లక్ష్యం,ఫర్హాన్ సరికొత్త ప్రపంచ రికార్డు!
సెమీ ఫైనల్ రేసులో నిలవాలంటే భారీ తేడాతో గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ అద్భుత ప్రదర్శన చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాక్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ షాహిబ్‌జాదా ఫర్హాన్ (100) ఈ టోర్నీలో తన రెండో చారిత్రక సెంచరీని బాదాడు. తద్వారా ఒకే టీ20 వరల్డ్‌కప్‌లో రెండు సెంచరీలు చేసిన మొదటి ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా విరాట్ కోహ్లీ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును కూడా ఫర్హాన్ అధిగమించాడు,ఫర్హాన్ మరియు ఫఖర్ జమాన్ (84) కలిసి తొలి వికెట్‌కు 176 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
శ్రీలంక బౌలర్లను విచ్చలవిడిగా ఉతికి ఆరేశారు, ఒక దశలో పాక్ 240 పరుగులు చేసేలా కనిపించినా, ఓపెనర్లు అవుటైన తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. కేవలం 31 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు కోల్పోవడంతో స్కోరు 212 వద్ద ఆగింది,పాకిస్తాన్ సెమీస్‌కు అర్హత సాధించాలంటే శ్రీలంకను 140 పరుగుల లోపే కట్టడి చేయాల్సి ఉంటుంది.శ్రీలంక ఫీల్డర్లు ఇచ్చిన క్యాచ్‌లను చేజార్చుకోవడం పాక్ బ్యాటర్లకు వరంగా మారింది. ముఖ్యంగా ఫర్హాన్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ టీ20 క్రికెట్‌లో సరికొత్త స్టార్‌గా ఎదిగాడు.
![]()
