india news
పాక్‌కు చుక్కలు చూపిస్తున్న ‘జలాస్త్రం’: సిద్ధమైన షాపూర్ కండీ డ్యామ్!
భారత్-పాక్ సరిహద్దుల్లో వ్యూహాత్మక మార్పులు మొదలయ్యాయి. ఉగ్రవాద చర్యలను దీటుగా ఎదుర్కొంటున్న భారత్, ఇప్పుడు సింధు జలాల ఒప్పందంపై కఠిన నిర్ణయం తీసుకోవడంతో పాటు, రావి నదిపై షాపూర్ కండీ డ్యామ్ నిర్మాణాన్ని దాదాపు పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే పాకిస్థాన్‌లోని లాహోర్ నగరానికి నీటి కష్టాలు తప్పవని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ప్రాజెక్టు రావి నది నుండి పాకిస్థాన్‌కు వెళ్తున్న మిగులు జలాలను అడ్డుకుని, మన దేశ అవసరాలకు (పంజాబ్, జమ్మూ కశ్మీర్) వాడుకోవడం,మార్చి 31, 2026 నాటికి పనులు పూర్తి కావచ్చని అంచనా,జమ్మూ కశ్మీర్‌లోని కథువా, సాంబా జిల్లాల్లో దాదాపు 79,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది,పంజాబ్‌లో 12,000 ఎకరాలకు పైగా భూమి సాగులోకి వస్తుంది,206 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి అవుతుంది,సుమారు రూ. 3,394 కోట్లు వ్యయం అవుతుంది.
పాకిస్థాన్‌పై ,లాహోర్ నగరం తన తాగునీరు మరియు భూగర్భ జలాల కోసం రావి నదిపైనే ఆధారపడి ఉంది. భారత్ ఈ నీటిని మళ్లించడం వల్ల లాహోర్‌లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది. “రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు” అన్న నినాదంతో భారత్ ముందుకు వెళ్తుండటంతో పాక్ ఆందోళన చెందుతోంది.1979లో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు 1982లో ఇందిరా గాంధీ శంకుస్థాపన చేశారు. రాష్ట్రాల మధ్య వివాదాల వల్ల దశాబ్దాలుగా ఆగిపోయిన ఈ పనులను మోదీ ప్రభుత్వం వేగవంతం చేసి, ఇప్పుడు జాతికి అంకితం చేసేందుకు సిద్ధమైంది.
![]()
