International

పాకిస్థాన్ తప్పు చేస్తే తీవ్ర పరిణామాలు: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక

మా సహనాన్ని అలుసుగా తీసుకోవద్దు - Mana Telangana

పాకిస్థాన్ మరోసారి తప్పు చేస్తే భారత్‌ నుంచి తీవ్రమైన ప్రతిస్పర్ధన ఎదురవుతుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. ‘ఆపరేషన్ సిందూర్’ పాకిస్థాన్‌కు కేవలం హెచ్చరిక మాత్రమేనని, ఇంకోసారి అటువంటి తప్పిదం జరిగితే పాకిస్థాన్ కోలుకునే అవకాశమే ఉండదని ఆయన స్పష్టం చేశారు.

గోవా తీరంలో భారత నౌకాదళ యుద్ధనౌక INS విక్రాంత్‌ను సందర్శించిన సందర్భంగా రాజ్నాథ్ సింగ్ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. “‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా ముగియలేదు, కేవలం విరామం ఇచ్చాము. భారత నౌకాదళం రంగంలోకి దిగితే ఏం జరుగుతుందో పాకిస్థాన్‌కు బాగా తెలుసు. 1971లో జరిగిన ఘటన దీనికి నిదర్శనం,” అని ఆయన గుర్తుచేశారు.

రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు పాకిస్థాన్‌కు బలమైన సందేశాన్ని పంపడమే కాకుండా, భారత నౌకాదళ సామర్థ్యాన్ని, దేశ రక్షణలో దృఢ సంకల్పాన్ని ప్రదర్శించాయి. ఈ హెచ్చరిక ద్వారా భారత్ తన సార్వభౌమత్వాన్ని, భద్రతను కాపాడుకోవడంలో ఎటువంటి రాజీ లేకుండా ముందుకు సాగుతుందని స్పష్టమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version