International
పాకిస్థాన్‌తో ట్రంప్ ఫ్యామిలీ కొత్త అనుబంధం – మేలో కీలక ఒప్పందం
పాకిస్థాన్ క్రిప్టో కౌన్సిల్ మరియు అమెరికాకు చెందిన వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ (WLF) మధ్య మే నెలలో ఒక కీలక ఒప్పందం కుదిరింది. బ్లాక్చెయిన్ టెక్నాలజీని పాక్ ఆర్థిక వ్యవస్థలో ప్రవేశపెట్టడం, డిజిటల్ ఫైనాన్స్‌ను విస్తరించడం ఈ ఒప్పంద లక్ష్యాలుగా ప్రకటించారు. పాకిస్థాన్ ఆర్థిక మంత్రిత్వశాఖ సమక్షంలోనే ఈ డీల్ ఖరారైనట్లు సమాచారం.
డబ్ల్యూఎల్ఎఫ్‌లో ట్రంప్ కుటుంబం ప్రధాన భాగస్వామ్యం
ఈ ఒప్పందానికి మరింత ప్రాధాన్యత కలిగించే అంశం ఏంటంటే, డబ్ల్యూఎల్ఎఫ్ సంస్థలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమారులు ఎరిక్ ట్రంప్, ట్రంప్ జూనియర్, అలాగే అల్లుడు జారెడ్ కుష్నర్ కలిపి సుమారు 60 శాతం వాటా కలిగి ఉన్నారు. దీంతో పాకిస్థాన్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ట్రంప్ ఫ్యామిలీకి ప్రత్యక్ష ప్రయోజనాలు ఏర్పడే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఆర్థిక లాభాలు, రాజకీయ ప్రయోజనాలపై చర్చ
పాక్ లో ఈ బ్లాక్చెయిన్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, ట్రంప్ కుటుంబానికి భారీ ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉన్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఈ డీల్ వెనుక రాజకీయ ప్రయోజనాలపై కూడా చర్చ జరుగుతోంది. పాక్ పై ట్రంప్ ప్రేమకి ఇది ఒక కారణమా? అనే ప్రశ్నను రాజకీయ విశ్లేషకులు ఉద్భవించ చేస్తున్నారు.