Andhra Pradesh
పలు జిల్లాలకు భారీ వర్షసూచన!
AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 3 గంటల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎన్టీఆర్, ఏలూరు, తిరుపతి, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో మోస్తరు వర్షాలకు అవకాశముందని ఎల్లో అలర్ట్ ఇచ్చింది.
Continue Reading