Entertainment

పదేళ్ల తర్వాత ఇండియాలో పాకిస్తానీ మూవీ

పదేళ్ల తర్వాత ఇండియాలో పాకిస్తానీ మూవీ… బ్లాక్‌ బస్టర్‌ రిలీజ్‌కి లైన్ క్లియర్

గత పది సంవత్సరాలుగా పాకిస్తానీ సినిమాలు ఇండియాలో విడుదల అవ్వడం లేదు. అంతే కాకుండా పాకిస్తానీ నటీ నటులు సైతం ఇండియన్‌ సినిమాల్లో కనిపించడం లేదు. రెండు దేశాల మధ్య గత కొంత కాలంగా ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సినిమాల విడుదలపై ప్రభావం పడింది. గతంలో పాకిస్తానీ సినిమాలు ఇండియాలో, బాలీవుడ్‌ మూవీస్‌ పాకిస్తాన్ లో రిలీజ్ అయ్యేవి. చాలా కాలం తర్వాత పాకిస్తానీ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ‘ది లెజెండ్‌ ఆఫ్‌ మౌలా జట్‌’ సినిమా ఇండియాలో విడుదల అవ్వబోతుంది. అక్టోబర్ 2న ఈ సినిమా ఇండియన్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

maula jatt

ఇండియా, పాకిస్తాన్‌ మధ్య ఉన్న ఘర్షణ వాతావరణం కారణంగా గత పదేళ్లుగా ఒక దేశం సినిమా మరో దేశంలో విడుదల అవ్వడం లేదు. అంతే కాకుండా పాకిస్తాన్‌ కు చెందిన నటీనటులు ఈ మధ్య కాలంలో ఇండియన్‌ మూవీస్ లో నటించడం లేదు. అనధికారికంగా నిషేధం కొనసాగుతోంది. ఎట్టకేలకు పాకిస్తాన్‌ మూవీ ఇండియాలో విడుదల కాబోతుంది. రెండు సంవత్సరాల క్రితం పాకిస్తాన్‌ లో విడుదల అయి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘ది లెజెండ్‌ ఆఫ్‌ మౌలా జట్‌’. ఈ సినిమా గతంలో వచ్చిన పాకిస్తానీ క్లాసిక్‌ మౌలా జట్‌ కు అధికారిక రీమేక్‌ అంటూ మేకర్స్ గతంలోనే ప్రకటించారు. సంచలన వసూళ్లు నమోదు చేసి ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచిన ఈ సినిమా ఇండియాలో రిలీజ్ కు సిద్ధం అయింది.

దర్శకుడు బిలాల్ లషారీ ఇటీవల మాట్లాడుతూ… అక్టోబర్‌ 2న పంజాబ్‌ తో పాటు భారత్ లో ది లెజెండ్‌ ఆఫ్‌ మౌలా జట్ ను థియేటర్‌ లలో విడుదల చేయబోతున్నాం. సినిమా విడుదల అయి రెండేళ్లు అవుతున్నా ఇంకా పాకిస్తాన్‌ లోని పలు థియేటర్ లలో వీకెండ్స్ లో మా సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ ను రాబడుతూ ఉంది. కనుక ఇండియాలోనూ మా సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకం ను ఆయన వ్యక్తం చేశాడు. ఇండియాలోని పంజాబీ ప్రేక్షకులను ఈ సినిమా అమితంగా అలరిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. హిందీ, పంజాబీ లో ఈ సినిమా డబ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version