Andhra Pradesh
పండుగకు వస్తున్నానని చెప్పి సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
హైదరాబాద్ : పండుగకు ఇంటికి వస్తానని తండ్రికి చెప్పి అదృశ్యమైన సాఫ్ట్వేర్ ఉద్యోగి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన KPHB పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా నంద్యాలకి చెందిన దాసరి వెంకటేశ్వర్లు (28) ఓ ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ, కూకట్‌పల్లిలోని బాయ్స్ పీజీలో నివాసముంటున్నాడు.
గత 24న తండ్రికి ఫోన్ చేసి పండుగకు ఇంటికి వస్తానని చెప్పిన వెంకటేశ్వర్లు, ఆ తర్వాత ఇంటికి రాలేదు. ఫోన్ చేయగా స్విచాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. పలుమార్లు ప్రయత్నించినా ఎటువంటి సమాచారం రాకపోవడంతో, తండ్రి కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
పోలీసులు కేసు నమోదు చేసి, వెంకటేశ్వర్లి అదృశ్యంపై దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తూ, అతని మొబైల్ లొకేషన్ ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కుటుంబ సభ్యులు అతన్ని క్షేమంగా కనుగొనాలని కోరుకుంటున్నారు.