International
నేపాల్‌లో హింసాత్మక పరిస్థితులు – షాపింగ్ మాల్‌లలో లూటీ
నేపాల్‌లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తుండగా, ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పోలీసుల శక్తి సరిపోకపోవడంతో అనేక ప్రాంతాల్లో పరిస్థితులు అదుపు తప్పాయి.
ఈ క్రమంలో షాపింగ్ మాల్‌లు, షోరూమ్‌లపై ప్రజలు దాడి చేశారు. టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు సహా దొరికినది దోచుకెళ్తున్నారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జనాలు గుంపులుగా చేరి ఏది దొరికితే అది ఎత్తుకెళ్తున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఇక పరిస్థితి పూర్తిగా నియంత్రణకు రావడం లేదని గుర్తించిన ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దింపింది. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అమలు చేయగా, లా & ఆర్డర్‌ను సైన్యం పర్యవేక్షిస్తోంది. ప్రజలను ఇంట్లోనే ఉండాలని అధికారులు హెచ్చరిస్తూ, అశాంతి చెలరేగితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.