Andhra Pradesh
నేడు రాజంపేటలో సీఎం పర్యటన – పెన్షన్ల పంపిణీ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఇవాళ ఉదయం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 63,61,380 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.2,746 కోట్ల నిధులను విడుదల చేసింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గాన్ని సందర్శిస్తున్నారు. ముందుగా కె.బోయినపల్లిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, అనంతరం తాళ్లపాక గ్రామంలో లబ్ధిదారులతో సమావేశం అవుతారు. వారి సమస్యలు, అభిప్రాయాలను స్వయంగా తెలుసుకోనున్నారు.
Continue Reading