Latest Updates
నేడు గవర్నర్ వద్దకు అఖిలపక్ష నేతలు
హైదరాబాద్: అసెంబ్లీలో ఆమోదం పొందిన పంచాయతీ రాజ్ చట్టం–2018 సవరణ బిల్లును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించాలన్న డిమాండ్‌తో ఇవాళ అఖిలపక్ష నేతలు ఆయనను కలవనున్నారు. ఈ మేరకు అన్ని పార్టీల ముఖ్య నేతలకు ఆహ్వాన లేఖలు పంపినట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రిజర్వేషన్ పరిమితి అంశంపై అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీసుకున్న తీర్మానాన్ని గవర్నర్ గౌరవించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
మంత్రి మాట్లాడుతూ, “సమాజంలోని వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ బిల్లును తెచ్చింది. అన్ని పార్టీలూ మద్దతు తెలిపిన నేపథ్యంలో గవర్నర్ ఆమోదం తెలిపేందుకు ఎలాంటి అవాంతరం ఉండకూడదు” అని అన్నారు. ప్రజల సంక్షేమం దృష్ట్యా ఈ సవరణ అత్యంత కీలకమని, గ్రామీణ స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
అఖిలపక్ష నేతల భేటీకి రాజకీయ వర్గాలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. గత కొన్నాళ్లుగా రిజర్వేషన్ పరిమితిపై జరుగుతున్న చర్చలకు ఇది ముగింపు పలికే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. గవర్నర్‌తో సమావేశం అనంతరం అన్ని పార్టీలు తమ అభిప్రాయాన్ని వెల్లడించనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారిన ఈ సవరణ బిల్లుపై గవర్నర్ నిర్ణయం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.