Andhra Pradesh
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి హత్యకు కుట్ర
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి హత్యకు సంబంధించిన సంచలన అంశాలు బయటకు వచ్చాయి. రౌడీషీటర్ల మధ్య జరిగిన ఒక సంభాషణ వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వీడియోలో ఐదుగురు రౌడీషీటర్లు కోటంరెడ్డి హత్య ప్రణాళికపై చర్చించినట్లు వెల్లడైంది. హత్య చేస్తే భారీగా డబ్బు వస్తుందని వారు పరస్పరం మాట్లాడుకున్నట్లు ఆ వీడియోలో వినిపిస్తోంది.
ఈ హత్య ప్రణాళికలో జగదీష్, మహేష్, వినీత్ కీలకంగా చర్చించగా, రౌడీషీటర్ శ్రీకాంత్‌కు జగదీష్ ముఖ్య అనుచరుడిగా ఉన్నాడని సమాచారం వెలుగులోకి వచ్చింది.
ఈ సంచలన వీడియోతో నెల్లూరులో ఉద్రిక్తత నెలకొంది.