Tech
నెట్ లేకపోయినా పని చేసే గూగుల్ కొత్త AI యాప్!
టెక్నాలజీ రోజు రోజుకీ కొత్త రూపాలు దాలుస్తోంది. మరీ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ఒక్క రోజుకు జరుగుతున్న మార్పులు అసలు ఊహించలేము. ఇదే వేగంలో టెక్ దిగ్గజం Google తాజాగా ఓ వినూత్న యాప్‌ను పరిచయం చేసింది. పేరు Google AI Edge Gallery. ఇది సాధారణ యాప్‌లా కాకుండా, ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా పనిచేసే AI ప్లాట్‌ఫాం అన్నమాట!
ఇది ప్రత్యేకంగా డెవలపర్స్ కోసం రూపొందించబడింది. డేటా ప్రాసెసింగ్, ఇమేజ్ రికగ్నిషన్, యూజర్ ఇంటరాక్షన్ లాంటి ఫంక్షన్లను లోకల్‌గా— అంటే మన ఫోన్ లేదా డివైస్ లోపలే జరిగేలా చేస్తుంది. ఫలితంగా, నెట్ లేకపోయినా కొన్ని కీలక పనులను స్మార్ట్‌గా పూర్తి చేయొచ్చు. ఇది AI రంగంలో edge computing అనే కొత్త దిశను ప్రోత్సహిస్తోంది.
ఇది కొత్తగా ఉన్నా, ఫ్యూచర్‌లో దీని ఆధారంగా ఎన్నో యాప్‌లు రూపొందించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌హోమ్ డివైస్‌లు, కార్లలోని సెన్సార్ సిస్టమ్స్‌కి ఇది భవిష్యత్తు దారి చూపిస్తుందని టెక్ విశ్లేషకులు అంటున్నారు.
ఇప్పటికి ఇది డెవలపర్ల కోసం ఫోకస్ చేసినా, రానున్న రోజుల్లో సాధారణ యూజర్లూ దీని ప్రయోజనాలు అనుభవించే రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తోంది. AIని ఆన్‌లైన్ డిపెండెన్సీ లేకుండా వాడేయడం అంటేనే ఇది కొత్త దిశ.