Andhra Pradesh
నూతన సంవత్సరం వేళ మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సంవత్సరానికి సిద్దమవుతున్న మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం మంచి వార్త చెప్పింది. 2026 నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టడానికి మరికొన్నిరోజులదూరంలో ఉన్న నేపథ్యంలో మద్యం విక్రయాలు, సేవల సమయాలపై క్లారిటీ ఇచ్చింది. ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలకు ప్రభుత్వం హామీ ఇచ్చి, సంబంధిత ఉత్తర్వులను విడుదల చేసింది. ఈ నిర్ణయంతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను మరింత ఆనందంగా జరుపుకోవచ్చు.
నూతన మద్యం వేడుకల సందర్భంలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాలు, సేవల సమయాల పొడిగింపుకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రత్యేక అనుమతులు ఇచ్చారు. ఎక్సైజ్, ప్రొహిబిషన్ డైరెక్టర్ సమర్పించిన నివేదికను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రత్యేక సడలింపుల ప్రకారం ఏ4 మద్యం దుకాణాలు డిసెంబర్ 31, 2025 మరియు జనవరి 1, 2026 తేదీల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయించవచ్చు.
అదే సమయంలో, 2B (బార్లు), C1 (ఇన్-హౌస్), EPI (ఈవెంట్ పర్మిట్), TD1 (ఇన్-హౌస్) లైసెన్సులు కలిగిన ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు చెందిన హోటళ్లు, రిసార్ట్లు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలు, రెస్టారెంట్ సేవలు కొనసాగించడానికి అనుమతి కలిగాయి. గత ఏడాది కొత్త సంవత్సరానికి అమలుచేసిన విధానాన్ని అనుసరించి ఈ సడలింపులు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది.
అయితే, ఈ ప్రత్యేక అనుమతులచే అక్రమ మద్యం, నాన్-డ్యూటీ పెయిడ్ మద్యం విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల అమలుకు ఎక్సైజ్ & ప్రొహిబిషన్ డైరెక్టర్, ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సమన్వయం చేస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. నూతన సంవత్సర వేడుకలు శాంతియుతంగా, చట్టబద్ధంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని అధికారులు వెల్లడించారు.
#APNewYear2026#APLiquorUpdate#ExciseDepartment#NewYearCelebrations#APGovernment#LiquorSales#BarsAndPubs
#ExciseOrders#APNews#BreakingNews#NewYearParty#APExcise#YearEndCelebrations
![]()
