Health
నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ప్రొవిజనల్ లిస్టు విడుదల.
TG: రాష్ట్రంలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల నియామకానికి సంబంధించిన ప్రొవిజనల్ లిస్టును మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) విడుదల చేసింది. అభ్యర్థులు తమ వివరాలను MHSRB అధికారిక వెబ్సైట్లో పరిశీలించుకోవచ్చని అధికారులు తెలిపారు. అలాగే, లిస్టులో ఎలాంటి లోపాలు ఉన్నా లేదా అభ్యంతరాలు ఉన్నా, ఈ నెల 26వ తేదీ నుంచి సెప్టెంబర్ 2వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఆన్లైన్ ద్వారా సమర్పించాలని సూచించారు.
గత ఏడాది నవంబరులో 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించగా, మొత్తం 40,423 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరైన విషయం తెలిసిందే.