Latest Updates

దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్లకు అలర్ట్ మెసేజ్లు పంపిస్తున్న NDMA

Emergency Alert: మీ ఫోన్‌కు ఎమర్జెన్సీ అలర్ట్‌ వచ్చిందా..? కారణమిదే.. |  have-you-received-emergency-alert--message-on-your-mobile

ప్రకృతి వైపరీత్యాలు లేదా మానవ కల్పిత అపాయాల సమయంలో ప్రజలకు ముందస్తు హెచ్చరికలు అందించేందుకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NDMA) మొబైల్ ఫోన్లకు అలర్ట్ మెసేజ్లు పంపిస్తోంది. ఇది దేశవ్యాప్తంగా నడుస్తున్న టెస్టింగ్ ప్రక్రియలో భాగం. భూకంపాలు, వరదలు, తుపాన్లు లాంటి అత్యవసర సందర్భాల్లో ప్రజలందరికీ సమయానికి సమాచారం చేరాలన్న ఉద్దేశంతో ఈ ప్రక్రియ చేపట్టింది. కరోనా లాక్‌డౌన్ సమయంలో కూడా NDMA ఇలాంటివే అలర్ట్లు పంపింది.

ఈ అలర్ట్ మెసేజ్లు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొబైల్ యూజర్లకు 19 భాషలలో పంపుతున్నారు. సమాచార, టెలికమ్యూనికేషన్ శాఖ సహకారంతో, టెలికాం నెట్‌వర్క్‌ల ద్వారా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రజలు ఈ మెసేజ్ చూసిన వెంటనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవి కేవలం టెస్ట్ మెసేజ్లు మాత్రమే అని NDMA స్పష్టం చేసింది. మరి మీకు ఈ మెసేజ్ వచ్చిందినా?

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version