Latest Updates

Air Train: దేశంలోనే తొలి ఎయిర్ ట్రైన్.. ఉచితంగా ప్రయాణం, డ్రైవర్ లేకుండానే పరుగులు

Air Train: దేశంలో తొలి ఎయిర్ ట్రైన్‌ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ ఎయిర్ ట్రైన్ పట్టాలు ఎక్కితే ప్రయాణికులకు మరింత సులభతరమైన ప్రయాణం కలగనుంది. ఈ తొలి ఎయిర్ ట్రైన్ మొత్తం 7.7 కిలోమీటర్ల మేర రూ.2 వేల కోట్లతో నిర్మించనున్నారు. ఇంతకీ అసలు ఈ ఎయిర్ ట్రైన్ అంటే ఏంటి. దాన్ని ఎక్కడ నడుపుతారు. ఎయిర్ ట్రైన్ విశిష్టతలు ఏంటి అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

దేశంలో రకరకాల ట్రైన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే మన దేశంలో ఎన్నో రైళ్లు ఉండగా.. గత కొన్నేళ్లుగా వందే భారత్‌ పేరుతో అత్యాధునిక రైళ్లు పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. వందే భారత్ మెట్రో(నమో భారత్) రైళ్లు ఇటీవలే ప్రారంభం కాగా.. ఇక వందే భారత్ స్లీపర్ రైళ్లు, తోపాటు బుల్లెట్ ట్రైన్ కూడా త్వరలోనే పట్టాలు ఎక్కనున్నాయి. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లోనే మరో హై టెక్నాలజీ రైలు కూడా అందుబాటులోకి రానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించారు. అదే ఎయిర్ ట్రైన్. డ్రైవర్ లేకుండానే పట్టాలపై పరుగులు తీయడం ఈ ఎయిర్ ట్రైన్ స్పెషాలిటీ. అంతేకాకుండా వీటిలో ప్రయాణికులకు ఉచితంగానే ప్రయాణం కల్పించనున్నారు.

దేశంలోనే అతి పెద్దదైన ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో.. ఈ తొలి ఎయిర్ ట్రైన్‌ అందుబాటులోకి రానుంది.

2027 నాటికి ఈ ఎయిర్ ట్రైన్‌ను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎయిర్ ట్రైన్‌ను (ఆటోమేటెడ్ పీపుల్ మూవర్-ఏపీఎం) అని కూడా పిలుస్తారు. చూడటానికి మెట్రో రైలు మాదిరిగానే ఉండే ఈ రైలులో ప్రత్యేకత డ్రైవర్ అవసరం లేకుండానే ఆటోమేటిక్‌గా ప్రయాణం చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version