Andhra Pradesh

దుబాయ్‌లో ఘనంగా ఆవిష్కరించిన “ఎన్టీఆర్ సజీవ చరిత్ర” గ్రంథం..!

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మహానేత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)కు మరో అరుదైన గౌరవం లభించింది. దుబాయ్‌లో జరిగిన ప్రవాస తెలుగు వారి ఆత్మీయ సదస్సులో ఆయనను స్మరించుకుంటూ “ఎన్టీఆర్ సజీవ చరిత్ర” గ్రంథాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజకీయ కార్యదర్శి టి.డి. జనార్దన్ — ఎన్టీఆర్ స్ఫూర్తి, పోరాట పటిమ, ప్రజాసేవ నేటి తరానికి అనుసరణీయమని ఉద్ఘాటించారు.

జనార్దన్ మాట్లాడుతూ — ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నో ముఖ్యమంత్రులు వచ్చినప్పటికీ, ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించిన నాయకుడు మాత్రం ఎన్టీఆర్ ఒక్కరేనని స్పష్టం చేశారు. “తెలుగునాటి రాజకీయాల చరిత్రను “ఎన్టీఆర్‌కు ముందు – ఎన్టీఆర్‌కు తర్వాత” అనే రెండు దశలుగా విడదీసి చెప్పవచ్చని ఆయన అన్నారు. “

ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా, ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు, భావజాలాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు యువతకు చేరువ చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్టు జనార్దన్ వెల్లడించారు. ఎన్టీఆర్ జీవితం, రాజకీయ పయనం, సేవా కార్యక్రమాలను ప్రతిబింబించే పుస్తకాల శ్రేణిని కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.

నేడు కాలానికి తగినట్లుగా డిజిటల్ మీడియాల శక్తిని వినియోగిస్తూ ‘అన్న ఎన్టీఆర్’ అధికారిక యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ ఛానల్ ద్వారా ఎన్టీఆర్ అరుదైన ప్రసంగాలు, చారిత్రాత్మక వీడియోలు, ఆయన చేసిన విశేష సేవలపై డాక్యుమెంటరీలు యువతకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఎన్టీఆర్ పేరు, ఆయన ఆశయాలు అజరామరం కావడం తన వ్యక్తిగత సంకల్పమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఎన్టీఆర్ పేరుతో సాహిత్య, సాంస్కృతిక, విద్యా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, ప్రవాస తెలుగు ప్రజల సహకారంతో మరిన్ని వినూత్న కార్యక్రమాలను చేపడతామని తెలిపారు.

ప్రవాస తెలుగుప్రజలు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పిస్తూ, ఆయన చూపిన మార్గంలో నడిచి తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టాలని ప్రతిజ్ఞ చేశారు. ఎన్టీఆర్ సాధారణ రాజకీయ నాయకుడు మాత్రమే కాదు – తెలుగు స్వయంకౌరవానికి ప్రతీక అని మరోసారి స్పష్టమైంది.

#NTRLiveHistory#AnnayyaNTR#NTRDigitalLegacy#TDPUpdates#NTRInDubai#TeluguCommunity#NTRInspiration

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version