Latest Updates
తెలంగాణ హక్కులను కాపాడటంలో కేంద్రం వెనుకడుగు వేయదు: కిషన్ రెడ్డి
తెలంగాణకు సంబంధించిన జలవివాదాల్లో కేంద్రం ఎప్పుడూ న్యాయంగా వ్యవహరిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బనకచర్ల పంపక వ్యవస్థ అంశంపై స్పందించిన ఆయన, ఈ విషయంలో కేంద్రం ఎటువంటి రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయం ఇవ్వదని చెప్పారు. జలవివాదాల పరిష్కారానికి రెండు రాష్ట్రాల మధ్య సంభాషన అవసరమని, కేంద్రం ఈ విషయంలో పాక్షికంగా కాకుండా సత్వర పరిష్కారానికి సహకరిస్తుందని వివరించారు.
తెలంగాణ హక్కులను కాపాడటంలో బీజేపీ ప్రభుత్వం వెనుకడుగు వేయదని, ఒక్క రాష్ట్రానికి అన్యాయం చేసి మరో రాష్ట్రానికి మేలు చేయడమనే పద్ధతిని కేంద్రం అనుసరించదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల ప్రజలకు, ముఖ్యంగా కరువు ప్రాంతాలకు న్యాయం జరగాలన్నదే కేంద్ర ప్రభుత్వ ధోరణి అని తెలిపారు. ఈ తరహా నీటి వివాదాలు రాజకీయ ప్రకటనల ద్వారా కాక, పరస్పర చర్చల ద్వారానే పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.