Latest Updates
తెలంగాణ భవన్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు
తెలంగాణ భవన్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయగా, శనివారం న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో కౌశిక్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణ భవన్‌ను ముట్టడించేందుకు వస్తున్నట్లు సమాచారం అందింది.
కౌశిక్‌రెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించనున్నట్లు తెలియడంతో పోలీసులు అప్రమత్తమై భవన్ చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయ వాతావరణంలో ఉద్రిక్తతను రేకెత్తిస్తోంది. పరిస్థితిని నియంత్రణలో ఉంచేందుకు పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.