News
తెలంగాణలో రెండు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు: వాతావరణ శాఖ హెచ్చరిక
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రెండు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు.
అలాగే, హైదరాబాద్ నగరంలో ఈ రోజు సాయంత్రం వర్షం కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిడుగుల వల్ల ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.