Andhra Pradesh
తిరుమల అప్డేట్: వైకుంఠ ద్వార దర్శనానికి కొత్త మార్గాల ద్వారా భక్తుల ఎంట్రీ..!!

తిరుమల:
వైకుంఠ ఏకాదశి సందడి చేరువవుతున్న నేపథ్యంలో తిరుమల కొండపై ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. భక్తుల అధిక రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ ముందస్తుగానే సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. ఏకాదశి, ద్వాదశి… అలాగే నూతన సంవత్సరం కలిసిరావడంతో కోటి సంఖ్యలో భక్తులు శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనానికి చేరుకునే అవకాశం ఉందని అంచనా. ఆ అనూహ్య రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక రూట్‌మ్యాప్ రూపొందిస్తూ టీటీడీ ముఖ్య నిర్ణయాలు తీసుకుంది.
వైకుంఠ ద్వార దర్శనాలు ఈసారి మొత్తం పది రోజులపాటు నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు భక్తులకు ప్రత్యేక దర్శన అవకాశం లభించనుంది. అయితే తొలి మూడు రోజులు రద్దీ అత్యధికంగా ఉండేందున, ఈ-డిప్ పద్ధతిలో ముందస్తుగా 1.76 లక్షల మందికి స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు కేటాయించడం ద్వారా భక్తుల ప్రవాహాన్ని నియంత్రించే ప్రయత్నం జరుగుతోంది.
తొలిరోజు ఐదు గంటలు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలకు కేటాయించగా మిగతా సమయం మొత్తం స్లాటెడ్ టోకెన్లు ఉన్న భక్తులకే వినియోగించనున్నారు. ప్రతి రోజూ 14 స్లాట్ల ప్రకారం టోకెన్లు జారీ చేయగా, ప్రవేశ మార్గాలను కూడా మూడు విభాగాలుగా విభజించారు —
ఉదయం స్లాట్లకు : కృష్ణతేజ సర్కిల్ ; మధ్యాహ్నం స్లాట్స్‌కు: ఏటీజీహెచ్ ;రాత్రి స్లాట్టకు: శిలాతోరణం సర్కిల్
ఈ మూడు రోజుల్లో టోకెన్ లేని భక్తులకు ఎలాంటి దర్శనం ఉండదని టీటీడీ ఇప్పటికే స్పష్టం చేసింది.
అయితే జనవరి 2 నుంచి 8 వరకు టోకెన్లు అవసరం లేకుండానే, భక్తులను వైకుంఠం క్యూకాంప్లెక్స్–2 నుంచి అనుమతించి సాధారణ దర్శనాలు నిర్వహించనున్నారు. ఈ రెండు రోజులు – 2, 3 తేదీల్లో – భారీ రద్దీ ఉండొచ్చన్న అంచనాలతో అధికారులు సెక్యూరిటీ, నీడార్పు, తాగునీటి సదుపాయాలు, క్యూ లైన్లలో వైద్యసిబ్బంది వంటి ఏర్పాట్లను పె తిరుమలలోని భక్తుల భద్రత, శాంతిభద్రతలు, దర్శన వ్యవస్థ సాఫీగా సాగేటట్లు అన్ని శాఖలూ ఒకే వేదికపై సమన్వయంతో పనిచేస్తున్నట్లు టీటీడీ పేర్కొంది.
#TTDUpdates#TirumalaDarshan#VaikunthaDwaraDarshanam#TirumalaNews#SlottedTokens#TTDAnnouncements#Tirupati
#SrivaruDarshanam#DevoteesRush#VaikunthaEkadasi2025#TTDServices#SpiritualJourney