Latest Updates
తలసాని ఫైరింగ్: “దమ్ముంటే ఆ పదవులు బీసీలకే ఇవ్వండి”
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల విషయమై కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. దమ్ముంటే కార్పొరేషన్ ఛైర్మన్ పదవులను బీసీలకు కేటాయించాలని కాంగ్రెస్‌ను సవాల్ చేశారు. బీఆర్ఎస్ భవన్‌లో పార్టీ నాయకులతో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీ రిజర్వేషన్ల అంశాన్ని డ్రామాలా మారుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఆగస్టు 8న కరీంనగర్‌లో భారీ బీసీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తలసాని తెలిపారు. అంతేకాకుండా ఉమ్మడి జిల్లాల వారీగా కార్యక్రమాలను చేపట్టి బీసీలకు అన్యాయం జరిగిన విషయాన్ని ప్రజలకు వివరించనున్నట్లు చెప్పారు. బీసీల హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ రూపొందించనుందని వెల్లడించారు.