Andhra Pradesh
తమ్ముడి పట్ల మెగాస్టార్ హృదయపూర్వక శుభాకాంక్షలు
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
“చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా, ప్రజా జీవితంలో జనసేనానిగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలు అందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాసేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం. ప్రజలందరి ఆశీస్సులతో నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని కోరుకుంటున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ” అని చిరంజీవి ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన పవన్‌తో కలిసి ఉన్న అరుదైన ఫొటోను కూడా పంచుకున్నారు.