Entertainment

డ్రగ్స్‌కు అలవాటు అయ్యేలా చేసింది ఆ నేతే: కోర్టులో హీరో శ్రీరామ్ సంచలన ఆరోపణలు

Srikanth gets questioned in Drug Case

డ్రగ్స్ కేసులో అరెస్టైన టాలీవుడ్ నటుడు శ్రీరామ్ (శ్రీకాంత్) కోర్టులో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు డ్రగ్స్‌కి అడిక్ట్ కావడానికి కారణం AIADMK మాజీ నేత ప్రసాద్ అని ఆరోపించారు. “ఆయన నాకు రూ.10 లక్షలు ఇవ్వాలి. డబ్బు అడిగిన ప్రతీసారి కొకైన్ ఇస్తూ, అసలు విషయాన్ని మరిచిపోయేలా చేశాడు. ఆ తర్వాత నేనే స్వయంగా డ్రగ్స్ అడుగుతున్న స్థితికి చేరిపోయాను,” అంటూ కోర్టులో వాపోయారు.

తప్పు తనదేనని అంగీకరించిన శ్రీరామ్, ఇకపై తన కుమారుడి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మారాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. “నన్ను ఓ తండ్రిగా చూసి, బెయిల్ మంజూరు చేయండి” అంటూ కోర్టును వేడుకున్నారు. ఈ కేసులో ఆయన చేసిన ఒప్పందాలు, నేతల ప్రమేయంపై విచారణ కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version