International
డెడికేషన్ అంటే ఇదే.. షాక్‌లో అభిమానులు!
టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తాజా ట్రాన్స్ఫర్మేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్లిమ్ లుక్‌లో కనిపిస్తున్న ఆయనను చూసి అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. గతంలో టమీ లుక్‌తో ఉన్న సర్ఫరాజ్ ఇప్పుడు ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెంచినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. రెండు నెలల్లోనే ఏకంగా 17 కేజీల బరువు తగ్గడం క్రికెట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవల జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఫోటోను సర్ఫరాజ్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేశాడు. “ఫిట్‌నెస్ అంటే మాత్రమే కాదు.. డిసిప్లిన్‌కి మానసిక బలానికి ఇదొక సాక్ష్యం” అంటూ ఆయన పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. టీమిండియా రేసులో నిలవాలంటే ఫిట్‌నెస్ కీలకమని తెలిసిన సర్ఫరాజ్, దిశగా తీసుకున్న స్టెప్‌కు క్రికెట్ విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.