Business

ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్‌.. దేశీయ మార్కెట్లపై గుణపాఠం

Donald Trump Tariffs: భారత్ పైన డోనాల్డ్ ట్రంప్ 26 శాతం టారిఫ్ కొరడా...ఏ  రంగాలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయో తెలుసుకుందాం..? donald trump tariffs donald  trump slaps 26 percent ...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కీలక నిర్ణయం భారత మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. భారత్ నుంచి దిగుమతులపై ట్రంప్ ప్రభుత్వం 25 శాతం టారిఫ్ విధించడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

సెన్సెక్స్ ఈ ఉదయం ప్రారంభం నుంచి భారీ ఒడిదుడుకులకు లోనై ప్రస్తుతం 700 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతోంది. నిఫ్టీ సైతం 150 పాయింట్లకు పైగా కోల్పోయింది. ప్రధానంగా మౌలిక రంగాలు, ఆటోమొబైల్, ఐటీ, బ్యాంకింగ్ రంగాలకు చెందిన షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. ట్రేడింగ్ నిపుణుల అభిప్రాయం మేరకు టారిఫ్ ప్రభావం రోజంతా మార్కెట్లపై పడే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు.

హెడ్లీ గెయినర్స్‌లో ఎటర్నల్, హిందుస్థాన్ యూనిలీవర్, టాటా స్టీల్, పవర్‌ గ్రిడ్ మాత్రమే నిలబడ్డాయి. మిగిలిన అన్ని రంగాల షేర్లు నెగటివ్ ట్రెండ్ చూపాయి. పెట్టుబడిదారుల విశ్వాసానికి తీవ్ర దెబ్బ తగలడంతో స్వల్పకాలికంగా మార్కెట్లలో ఒత్తిడి కొనసాగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం విధించిన టారిఫ్‌లపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్న దానిపై కూడా మార్కెట్ల దృష్టి కేంద్రీకృతమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version