International
టెస్టుల్లో మోస్ట్ రన్స్.. మూడో స్థానానికి జో రూట్
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తన టెస్ట్ కెరీర్‌లో మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. టీమ్ ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో 35 పరుగులు చేసిన రూట్.. దక్షిణాఫ్రికా దిగ్గజం జాక్ కల్లిస్‌ను అధిగమించారు. ఈ మ్యాచ్‌తో కలిపి రూట్ మొత్తం 13,319 పరుగులు చేసి టెస్టుల్లో మోస్ట్ రన్స్ చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. కల్లిస్ కెరీర్‌లో 13,289 పరుగులు సాధించగా, రూట్ ఆయనను అధిగమించి కొత్త చరిత్ర సృష్టించాడు.
ఇప్పుడు టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు జాబితాలో సచిన్ టెండూల్కర్ (15,921) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, అతనికి అతి సమీపంలో ఆస్ట్రేలియన్ గ్రేట్ రికీ పాంటింగ్ (13,378) ఉన్నారు. వీరిలో తర్వాతే జో రూట్ (13,319) నిలిచాడు. ఈ జాబితాలో ద్రవిడ్, అలిస్టెర్ కుక్, సంగక్కర, బ్రియాన్ లారా, చంద్రపాల్, జయవర్ధనేతొ సహా ఎన్నో దిగ్గజాలు ఉన్నాయి. ఇప్పటికీ టెస్ట్ క్రికెట్‌లో కొనసాగుతున్న రూట్‌కు ఈ జాబితాలో మరింత ఎగబాకే అవకాశం ఉంది.