Entertainment
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై యోగ్రాజ్ సింగ్ ప్రశంసలు
టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఆటతీరుపై మాజీ క్రికెటర్, యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ పొగడ్తలు కురిపించారు. రోహిత్ ఒక క్లాస్ ప్లేయర్ అని, అతని శైలి ప్రత్యేకమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం 2027 వరల్డ్‌కప్‌లో రోహిత్ పాల్గొనగలడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
“రోహిత్ లాంటి షాట్స్ ఎవరూ ఆడలేరు. అతడికి ఉన్న టెంప్రమెంట్, టెక్నిక్ ఇతర ఆటగాళ్లలో కనిపించదు. మరో ఐదేళ్లపాటు రోహిత్ ఆట కొనసాగించగలడు. అవసరమైతే BCCI అతడిని ఆడమని కోరాలి. 45 ఏళ్ల వయసు వరకూ కూడా అతడు ఆడే శక్తి కలిగివున్నాడు” అని యోగ్రాజ్ సింగ్ స్పష్టం చేశారు.
అలాగే, ఫిట్నెస్‌ను కాపాడుకుంటూ రోహిత్ నిరంతరం రాణించగలడని ఆయన అభిప్రాయపడ్డారు. “అతడు శరీరాన్ని సరిగ్గా చూసుకుంటే, ఇంకా ఎన్నో సంవత్సరాలు జట్టుకు సేవలు అందించగలడు. రోహిత్ ప్రదర్శన భవిష్యత్తులో భారత క్రికెట్‌కు ఎంతో అవసరం” అని యోగ్రాజ్ పేర్కొన్నారు.