Entertainment
టాలీవుడ్ హీరోయిన్‌ల కెరీర్ బ్రేక్స్ & కమ్‌బ్యాక్స్
టాలీవుడ్‌లో హీరోయిన్ కెరీర్ అంటే ఎప్పుడూ ఒకే రీతిగా సాగదు. కొన్నిసార్లు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటారు.. మరికొన్నిసార్లు గ్యాప్ తీసుకుంటారు. కానీ ఆ గ్యాప్ వల్ల కెరీర్ అయిపోయిందనుకోవడం పొరపాటు. ఎందుకంటే, ఈ సైలెంట్ కిల్లర్స్ అదే స్పీడ్, అదే జోరుతో తిరిగి వచ్చేస్తున్నారు.
సంజుక్త మీనన్
భీమ్లా నాయక్, బింబిసార, సార్, విరూపాక్ష వంటి హిట్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంయుక్త మీనన్.. రెండేళ్లుగా కనిపించకపోవడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. కానీ కెరీర్ ముగిసిందనుకుంటే పొరపాటు. ప్రస్తుతం అఖండ 2, స్వయంభు, బెంజ్, నారినారి నడుమ మురారి, హైందవంతో పాటు పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి సినిమాల్లో నటిస్తున్నారు. గ్యాప్ తర్వాత మరో రెండేళ్లు తానే స్క్రీన్‌పై డామినేట్ చేసేలా ప్లాన్ చేసుకుంటోంది.
భాగ్యశ్రీ బోర్సే
మిస్టర్ బచ్చన్ తర్వాత ఈమెకు గ్యాప్ వచ్చినా.. మళ్లీ అదే జోరుతో రాబోతోంది. గతంలో విజయ్ దేవరకొండ కింగ్డమ్లో కనిపించిన ఈ బ్యూటీ, త్వరలోనే దుల్కర్ సల్మాన్ కాంతా, రామ్ ఆంధ్రా కింగ్ సినిమాల్లో నటిస్తోంది. వచ్చే ఏడాది మొత్తం భాగ్యశ్రీ దర్శనమే అని ఇండస్ట్రీ టాక్.
కయాదు లోహర్
“డ్రాగన్ బ్యూటీ”గా పిలవబడే కయాదు లోహర్ కూడా గ్యాప్ తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చింది. అల్లూరి తర్వాత మూడేళ్లకు తిరిగి స్క్రీన్‌పై కనిపిస్తున్న ఈమె, ప్రస్తుతం విశ్వక్ సేన్ ఫంకీలో నటిస్తోంది.
శ్రీలీల
ఇండస్ట్రీలో టాప్ బిజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న శ్రీలీల కూడా ఇటీవల చిన్న బ్రేక్ తీసుకుంది. కానీ ఇప్పుడు తిరిగి వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజ మాస్ జాతర, అఖిల్ లెనిన్ సినిమాల్లో శ్రీలీల రాబోతోంది. మొత్తానికి.. టాలీవుడ్ బ్యూటీస్ కెరీర్‌లో బ్రేక్ వచ్చినా.. అది ఎండ్ కాదని.. కొత్త ఎనర్జీతో, కొత్త స్పీడ్‌తో మళ్లీ గ్లామర్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు.