Uncategorized
టారిఫ్స్ లేకపోతే అమెరికా నాశనమయ్యేది: ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్స్‌పై తన అభిప్రాయం వెల్లడించారు. ఇటీవల కోర్టు ఆయన అధికార పరిధి దాటి టారిఫ్స్ విధించారని ఆక్షేపించగా, ట్రంప్ స్పందించారు.
“టారిఫ్స్ వల్ల అమెరికాకు ట్రిలియన్ల డాలర్లు వచ్చాయి. అవి లేకపోతే దేశం పూర్తిగా నాశనమయ్యేది. మిలిటరీ శక్తి కూడా కోల్పోయేదే. ఈ విషయాన్ని ర్యాడికల్ లెఫ్ట్ జడ్జిలు అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ మాజీ అధ్యక్షుడు ఒబామా నియమించిన ఒక జడ్జి మాత్రం దేశ ప్రయోజనాల కోసం ఓటు వేశారు. ఆయన ధైర్యానికి కృతజ్ఞతలు” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.