Latest Updates
జితేశ్ శర్మ సిక్సర్లతో RCBని గెలిపించాడు: వైరల్‌గా మారిన ఇంటర్వ్యూ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టాండిన్ కెప్టెన్ జితేశ్ శర్మ నిన్న లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. కేవలం 33 బంతుల్లో 85 రన్స్ సాధించి, ఆకట్టుకునే బ్యాటింగ్‌తో RCB అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు.
ఈ నేపథ్యంలో, లీగ్ ప్రారంభానికి ముందు జితేశ్ శర్మ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, “RCB ఫ్యాన్స్ ఆందోళన పడొద్దు, నేనంతా చూసుకుంటాను,” అని ధీమాగా చెప్పారు. ఈ మాటలు ఇప్పుడు ఆయన ప్రదర్శనతో నిజమైనట్లు కనిపిస్తున్నాయి.
అంతేకాదు, జితేశ్ తన ఆటోగ్రాఫ్ అనుభవాన్ని కూడా ఆ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. “RCBలో చేరకముందు నా ఆటోగ్రాఫ్ కోసం ఎవరూ రాలేదు. కానీ, బెంగళూరు జట్టులో భాగమైన తర్వాత వందల మంది నా వద్ద ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు,” అని ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యలు RCB అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి.
జితేశ్ శర్మ ఆటతీరు, ఆత్మవిశ్వాసం జట్టుకు కొత్త ఊపిరిని ఇస్తున్నాయి. ఆయన నాయకత్వంలో RCB మరిన్ని విజయాలు సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.