Andhra Pradesh
జగన్ రాక్షసానందం అని షర్మిల ఆగ్రహం
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వాహనం కింద సింగయ్య అనే వ్యక్తి నలిగి మృతి చెందిన ఘటనపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయని, జగన్‌లో బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆమె ఆరోపించారు.
షర్మిల తన X ఖాతాలో స్పందిస్తూ, “టైరు కింద మనిషి పడినా సోయి లేకుండా జగన్ చేతులూపడం ఏంటి? బెట్టింగ్‌లో ఓడిపోయి ఆత్మహత్య చేసుకున్న ఒక వ్యక్తి కోసం ఇద్దరి ప్రాణాలు బలి తీసుకున్నారా? ఇదెక్కడి రాక్షసానందం? ప్రజల ప్రాణాలతో శవ రాజకీయాలు చేస్తారా?” అని ప్రశ్నించారు. ఈ ఘటనలో జగన్ పూర్తి బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సంఘటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.