International
చైనా సోలార్ ఎనర్జీలో USను దాటిపోనుంది: ఎలాన్ మస్క్
ప్రస్తుతానికి చైనా సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 100 టెరావాట్-ఆవర్స్ (TWh) ఉండగా, అది ప్రతి రెండేళ్లకూ రెట్టింపవుతోందని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. ఈ ప్రగతితో రాబోయే నాలుగు సంవత్సరాల్లో చైనా పునరుత్పాదక శక్తి ఉత్పత్తిలో అమెరికాను మించిపోతుందని ఆయన హెచ్చరించారు. ఈ విషయంలో ట్రంప్ ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉందని మస్క్ సూచించారు.
ఇందుకోసం సరైన విధానాలు తీసుకోకపోతే, అమెరికా సోలార్ రంగం వెనక్కి తగ్గే ప్రమాదముందని ఆయన తెలిపారు. ఇప్పటికే మస్క్ సోదరుడు “బిగ్ బ్యూటిఫుల్ బిల్” US సోలార్ ఎనర్జీని గణనీయంగా తగ్గించే విధంగా ఉందంటూ విమర్శలు చేశారు. చైనా వేగంగా పునరుత్పాదక శక్తిలో ఆధిక్యం సాధిస్తుండటంతో అమెరికా తన ఎన్‌ర్జీ పాలసీలను తిరిగి పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పరిశీలకులు పేర్కొంటున్నారు