Connect with us

Latest Updates

చైనా విక్టరీ పరేడ్‌కు సిద్ధం – హాజరుకానున్న ప్రపంచ నేతలు

image

ద్వితీయ ప్రపంచ యుద్ధంలో విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చైనా రేపు విక్టరీ పరేడ్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ హాజరుకానున్నారు.

అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్‌తో పాటు ఆసియా, ఆఫ్రికా, యూరప్, లాటిన్ అమెరికా దేశాల నేతలు కూడా పాల్గొననున్నారు.

ఈ వేడుకలో చైనా తన సైనిక శక్తిని ప్రదర్శించనుంది. అత్యాధునిక యుద్ధ విమానాలు, క్షిపణులు, వార్‌హెడ్లను ప్రజలకు చూపించేందుకు ఏర్పాట్లు చేసింది.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *