Latest Updates
చైనా పర్యటనకు ప్రధాని మోదీ?
ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే ఆగస్టులో చైనా పర్యటనకు సిద్ధమవుతున్నారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు చైనాలో జరగనుండగా, ఇందులో ప్రధాని పాల్గొనే అవకాశముందని తెలుస్తోంది.
2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత మోదీ చైనా పర్యటనకు వెళ్లలేదు. అయితే, ఇటీవలి రోజుల్లో భారత్-చైనా మధ్య సంబంధాలు కాస్త మెరుగుపడుతున్న తరుణంలో ఈ పర్యటనకు ఆయన సిద్దమవుతున్నట్టు సమాచారం. పర్యటన సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం కూడా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.