Business
చైనా ఖనిజాల ఎగుమతి నిషేధాన్ని ఎత్తివేసింది
భారత్‌తో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు చైనా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి అరుదైన ఖనిజాలు, ఎరువులు, అలాగే టన్నెల్ బోరింగ్ మిషన్ల ఎగుమతులపై ఇప్పటివరకు అమలులో ఉన్న నిషేధాన్ని ఎత్తివేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీని వల్ల రెండు దేశాల మధ్య వ్యాపార ప్రవాహం సులభతరం కానుందని, ముఖ్యంగా మౌలిక వసతులు, వ్యవసాయ రంగాలకు ఇది అనుకూలంగా మారనుందని నిపుణులు చెబుతున్నారు.
వాణిజ్య అంశాలతో పాటు సరిహద్దు వివాదాలపై కూడా చర్చలు జరిపిన రెండు దేశాలు, పరస్పర సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని అంగీకరించాయి. వాణిజ్య పరంగా కలసికట్టుగా ముందుకు సాగితేనే రెండు దేశాలకు లాభం కలుగుతుందని, ప్రాంతీయ స్థిరత్వం కూడా సాధ్యమవుతుందని చైనా మరియు భారత ప్రతినిధులు స్పష్టంచేశారు. ఇదే సమయంలో ఆసియా ప్రాంతంలో ఆర్థిక సమన్వయం పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఈ నిర్ణయం భారత పరిశ్రమలకు పెద్ద ఊపునిస్తుందని వ్యాపార వర్గాలు ఆశిస్తున్నాయి. ముఖ్యంగా రోడ్లు, మెట్రో రైలు ప్రాజెక్టులు, మైనింగ్ రంగాల్లో ఉపయోగించే టన్నెల్ బోరింగ్ మిషన్లకు చైనా నుంచి వచ్చే సరఫరా తిరిగి ప్రారంభం కావడం ఎంతో సహాయకరమని చెబుతున్నారు. అంతేకాదు, ఎరువుల దిగుమతి పునఃప్రారంభం కావడం వల్ల రైతులకు కూడా లాభం కలుగుతుందని నిపుణుల అభిప్రాయం. మొత్తానికి ఈ ఒప్పందం భారత్–చైనా సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని చెప్పవచ్చు.