Andhra Pradesh
చెవిరెడ్డికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో మరొకసారి చర్చనీయాంశంగా మారాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మద్యం కుంభకోణం కేసులో అరెస్టయ్యిన ఆయన.. ఇప్పుడు ఆరోగ్య సమస్యలతో వార్తల్లో నిలిచారు. తాజాగా చెవిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు.
విజయవాడ సబ్ జైలు నుంచి ఆయనను మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ముఖ్యంగా విజయవాడలోని సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌కి చెవిరెడ్డిని తీసుకువచ్చారు. అక్కడ వైద్యులు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. చెవిరెడ్డికి గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయా? మధుమేహం వల్ల ఇబ్బందులు వస్తున్నాయా? అనే అంశాలపై వైద్యులు పరీక్షలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. మద్యం కుంభకోణం కేసులో ఇటీవల చెవిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం కోర్టులో హాజరు పరచగా, జూలై 1 వరకు రిమాండ్ విధించారు. అప్పటి నుంచి చెవిరెడ్డి విజయవాడ సబ్ జైలులోనే ఉన్నారు. అయితే ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఇక చెవిరెడ్డి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? మరోవైపు కేసు దర్యాప్తు ఏ దశకు చేరుకుంది? అనే విషయాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. రాజకీయంగా ఇది కొత్త మలుపు తిరుగుతుందా? లేక ఇదంతా ఆరోగ్య సమస్యల కోణంలోనే కొనసాగుతుందా? అనేది చూడాల్సిందే.