మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి చిత్తూరు పర్యటనకు ఇవాళ ఉదయం బయలుదేరారు. కొద్దిసేపట్లో ఆయన చిత్తూరు జిల్లాలో అడుగుపెట్టనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా బంగారుపాళెం మార్కెట్ యార్డును జగన్ పరిశీలించనున్నారు. అక్కడ మామిడి రైతులతో ముఖాముఖీ సమావేశమై, వారి సమస్యలను స్వయంగా తెలుసుకోనున్నారు. మార్కెట్ వ్యవస్థ, దిగుబడులకు లభిస్తున్న ధరలపై రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించే అవకాశం ఉంది.
జగన్ పర్యటన నేపథ్యంలో పోలీస్ విభాగం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. మార్కెట్ యార్డు వద్ద 500 మందికి, హెలిప్యాడ్ వద్ద 30 మందికి మాత్రమే అనుమతినిచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జగన్ భావిస్తున్నట్టు ఆయన మద్దతుదారులు పేర్కొన్నారు. ఈ పర్యటనతో మామిడి రైతుల్లో కొంత ఆశావహ భావన నెలకొంద.