Latest Updates
చనిపోడానికి అనుమతి ఇవ్వండి: రాష్ట్రపతికి మధ్యప్రదేశ్ టీచర్ లేఖ
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన టీచర్ చంద్రకాంత్ జెత్వానీ (వయసు 52) ఓ భావోద్వేగాత్మక నిర్ణయం తీసుకున్నారు. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి లేఖ రాశారు. తన మరణం తర్వాత అవయవాలను దానం చేయడం ద్వారా ఇతరులకు జీవితం ఇవ్వాలన్న ఆమె ఆశయం.
2020లో జరిగిన ఆర్థోపెడిక్ శస్త్రచికిత్స విఫలమైన కారణంగా చంద్రకాంత్ పక్షవాతానికి లోనయ్యారు. అప్పటి నుంచి వీల్‌చైర్‌పై జీవితం గడుపుతున్నారు. స్కూల్‌కి వెళ్లడం కూడా కష్టంగా మారిందని, శారీరకంగా కాదు మానసికంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని లేఖలో పేర్కొన్నారు. చిన్నారులకు ధైర్యం చెప్పే ఉద్యోగం చేస్తూ తాను ఆత్మహత్యకు పాల్పడలేనని, అందుకే చనిపోవడానికి అధికారిక అనుమతి కావాలని విన్నవించారు.
తన జీవితాన్ని చివరి వరకు విలువైనదిగా మార్చాలన్న సంకల్పంతో చంద్రకాంత్ తన ఆస్తిని పేద విద్యార్థులకు విరాళంగా ఇచ్చారు. ఇప్పుడు తన శరీరాన్ని కూడా సేవాకార్యంలో భాగం చేయాలనుకుంటున్నారు. ఆమె లేఖ భావోద్వేగం కలిగించేలా ఉంది.