Latest Updates

“గోవా క్లబ్ ఘటనా కేసు: ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసు జారీ – నోటీసుల రంగుల అర్థాలు తెలుసుకోండి”

గోవాలోని ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్‌లో చోటుచేసుకున్న ఘోర అగ్ని ప్రమాదం దేశాన్ని కుదిపేసింది. ఈ విషాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే క్లబ్ యజమానులు సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రా దేశం విడిచి పరారయ్యారని అధికారులు ఇటీవల స్పష్టంచేశారు.

శనివారం రాత్రి ప్రమాదం చోటుచేసుకున్న వెంటనే కేసు నమోదు చేయగా, అదే రాత్రి ముంబై విమానాశ్రయం నుంచి ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటలకు థాయిలాండ్‌లోని ఫుకెట్‌కు ఈ ఇద్దరూ వెళ్లిపోయినట్లు గోవా పోలీసులు నిర్ధారించారు.

గోవా పోలీసులు ఇప్పుడు వీరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు ఇంటర్‌పోల్ సహకారం తీసుకోనున్నారు. త్వరలోనే లూథ్రా బ్రదర్స్‌పై బ్లూ కార్నర్ నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

పరారీ అయిన వెంటనే పోలీసులు చేసిన చర్యలు

ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఢిల్లీకి వెళ్లి లూథ్రా సోదరుల ఇళ్లను తనిఖీ చేశారు. అయితే వారు అక్కడ లేకపోవడంతో, వారి నివాసాల వద్ద నోటీసులు అతికించారు. ఆ తరువాత వెంటనే బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ద్వారా లుక్ అవుట్ సర్క్యులర్ (LOC) జారీ చేయబడింది.

అయితే వారు ఇప్పటికీ దేశంలోకి తిరిగి రాకపోవడం, విదేశాల్లో తలదాచుకోవడం వల్ల, వారిని ట్రేస్ చేయడానికి పోలీసులు సీబీఐ–ఇంటర్‌పోల్ విభాగంతో కలిసి పనిచేస్తున్నారు.

బ్లూ కార్నర్ నోటీస్ అంటే ఏమిటి?

బ్లూ కార్నర్ నోటీస్ అనేది ఒక వ్యక్తి

ఎక్కడ ఉన్నాడు?

ఎక్కడికి వెళ్తున్నాడు?

ఎలాంటి కదలికలు చేస్తున్నాడు?

అన్న వివరాలను సేకరించడానికి ఇంటర్‌పోల్ జారీ చేసే నోటీస్. ఇది అరెస్ట్ వారెంట్ కాదు కానీ నేరానికి సంబంధించి వ్యక్తి మువ్మెంట్స్‌ను ట్రాక్ చేయడానికి చాలా కీలకమైన సాధనం.

ఇంటర్‌పోల్ జారీ చేసే ఇతర నోటీసులు
రంగు అర్థం / ఉపయోగం
రెడ్ నోటీస్ నేరస్ధుడిని పట్టుకుని అప్పగింతకు పంపడానికి
బ్లాక్ నోటీస్ గుర్తించని మృతదేహాల గురించి సమాచారం
యెల్లో నోటీస్‌కు సహకారం తప్పిపోయిన వ్యక్తుల కోసం
గ్రీన్ నోటీస్ ప్రజలకు ముప్పు కలిగించే వ్యక్తులపై హెచ్చరిక
ఆరెంజ్ నోటీస్ పేలుడు పదార్థాలు వంటి అత్యవసర ప్రమాదాలపై అలర్ట్ పర్పుల్ నోటీస్ నేర పద్ధతులు, సాధనాలకు సంబంధించిన సమాచారం.

#GoaFireAccident #GoaNightclub #InterpolNotice #BlueCornerNotice #LuthraBrothers #GoaPolice #IndiaNews #CrimeUpdate #InterpolIndia #PhuketFlight #BreakingNews #CBIUpdate #FireAccidentCase

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version