Latest Updates
గచ్చిబౌలిలో పిడుగు పడి ఆందోళన – జనం పరుగులు, వాహనదారులకు ఇబ్బందులు
హైదరాబాద్‌లో వర్షాలు తీవ్రమవుతున్న వేళ, గచ్చిబౌలి పరిధిలోని ఖాజాగూడ లంకోహిల్స్ సర్కిల్ వద్ద ఉద్విగ్నత నెలకొంది. HP పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న తాటిచెట్టుపై ఒక్కసారిగా పిడుగు పడడంతో స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు.
పిడుగు భారీ శబ్దంతో పడటంతో అక్కడున్న జనం పరుగులు తీసారు. ఈ ఘటన కాసేపటి పాటు రోడ్డు మీద గందరగోళాన్ని నెలకొల్పింది. అప్పటికే ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
వర్షం తీవ్రత దృష్ట్యా పౌరులు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు, గచ్చిబౌలి వంటి కీలక ప్రాంతాల్లో వర్షానికి తాత్కాలిక ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిడుగుల సమయంలో చెట్ల క్రింద లేక ఓపెన్ ప్రాంతాల్లో నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.