Latest Updates
క్రికెట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని అభినందించిన ప్రధాని మోదీ
రాజస్థాన్ రాయల్స్ యువ క్రికెటర్, క్రికెట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. పట్నా విమానాశ్రయంలో జరిగిన ఈ సమావేశంలో వైభవ్ తన కుటుంబంతో కలిసి ప్రధాని మోదీతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను ప్రధాని మోదీ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
వైభవ్ సూర్యవంశీ క్రికెట్ నైపుణ్యాలను దేశం మొత్తం ప్రశంసిస్తోందని మోదీ పేర్కొన్నారు. “వైభవ్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. అతడికి నా శుభాకాంక్షలు,” అని మోదీ తన సందేశంలో రాసుకొచ్చారు.
ఈ సమావేశం వైభవ్ సూర్యవంశీకి ప్రధాని మోదీ నుంచి లభించిన గుర్తింపుగా నిలిచింది. యువ క్రీడాకారుడిగా తన ప్రతిభను చాటుతున్న వైభవ్‌కు ఈ అభినందన భవిష్యత్‌లో మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని అభిమానులు భావిస్తున్నారు.